09-09-2025 12:47:11 AM
జిల్లాలో వరద నష్టంపై ప్రాథమికంగా అంచనా వేసిన వ్యవసాయాధికారులు
మంచిర్యాల, సెప్టెంబర్ 8 (విజయక్రాం తి): జిల్లాలో కురిసిన వర్షాలు, వరదలతో పంటలకు నష్టం వాటిల్లింది. వేల ఎకరాల లో పత్తి, వరి, కూరగాయలు నీటమునిగా యి. పంట పొలాల్లో మట్టి, ఇసుక దిబ్బలు వేశాయి. పంట చేలల్లో, తోటల్లో నీరు నిలిచి దెబ్బతిన్నాయి. దీనితో పెట్టుబడి పెట్టిన లక్షల రూపాయలు వర్షం పాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలోని 18 మండలాల్లోని 187 గ్రామాల్లో వర్షం, వరద వల్ల వరి, పత్తి, కూరగాయలు, మొక్కజొన్న, మిర్చీ తదితర పంటలు దెబ్బతిన్నాయి. అధికారుల ప్రాథమిక అంఛనా ప్రకారం 3,756 మంది రైతులకు చెందిన వరి పంటకు 6,594.07 ఎకరాల్లో నష్టం జరిగిందని, 5501 మంది రైతులకు చెందిన 9,501 ఎకరాల్లో పత్తి, 40 ఎకరాల్లో 20 మందికి చెందిన మిర్చి పంట, 16 ఎకరాల్లో 22 మంది సాగు చేస్తున్న కూరగాయలు,
40 ఎకరాల్లో 25 మంది సాగు చేస్తున్న మొక్కజొన్న పంటతో పాటు ఒక రైతు సాగుచేసిన ఎకరం మినుము పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 16,198.07 ఎకరాల్లో 9,319 మంది సాగు చేస్తున్న వివిధ పంటలకు నష్టం జరిగినట్లు అంఛనా వేశారు. పంట శాతం ఆధారంగా నష్ట పోయి న రైతులకు ఎకరాకు రూ. 10 వేలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది.