calender_icon.png 9 September, 2025 | 12:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్టహాసంగా సుల్తానాబాద్ జోనల్ స్థాయి ఎస్‌జీఎఫ్ పోటీలు

09-09-2025 12:47:01 AM

సుల్తానాబాద్, సెప్టెంబర్ 8 ( విజయ క్రాంతి ); తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే క్రీడా పోటీల్లో భాగంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎస్ జి ఎఫ్ జోనల్ స్థాయి పోటీలు సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వేదికగా ఎస్ జి ఎఫ్ అండర్ 14,17 బాలికల కబడ్డీ, ఖో ఖో వాలీబాల్ పోటీలు ఘనంగా జరిగాయి. ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా సుల్తానాబాద్ ఎంపీడీవో దివ్యదర్శనరావు, సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ రమేష్, ఎంఈఓ ఆరెపల్లి రాజయ్య, పెద్దపల్లి జిల్లా డివైఎస్‌ఓ అక్క పాక సురేష్, పెద్దపల్లి జిల్లా ఎస్ జి ఎఫ్ కార్యదర్శి లక్ష్మణ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రీ డల పట్ల ఆసక్తి పెంధించుకోవాలన్నా లక్ష్యంతోనే ప్రభుత్వం ఎస్ జి ఎఫ్ పేరిట క్రీడా పో టీలు నిర్వహిస్తుందని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, దేహ దారుఢ్యానికి దోహదపడుతాయని, ఇటీవల ప్రపంచస్థాయి అర్చరి పోటీలలో పెద్దపెల్లి జి ల్లా ఎలిగేడు మండలానికి చెందిన చికిత గో ల్ మెడల్ సాధించడం మనకు గర్వకారణం అని, ఆమెను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులంతా మీకు ఇష్టమైన క్రీడను ఎంచుకొని రా ణించాలని అన్నారు.

జోనల్ స్థాయి పోటీల లో సత్తా చాటిన సుల్తానాబాద్ మండలంసుల్తానాబాద్ జోనల్ స్థాయి వాలీబాల్, క బడ్డీ, ఖో ఖో, జట్లు మొదటి స్థానంలో నిలిచి సత్తా చాటాయి. ఈ కార్యక్రమంలో గౌట్ హై స్కూల్ పాఠశాల హెడ్మాస్టర్ రత్నాకర్ రెడ్డి, రాజ్ కుమార్, సుల్తానాబాద్ స్పోరట్స్ క్లబ్ అధ్యక్షులు ముస్త్యాల రవీందర్, కార్యదర్శి అ మీర్ శెట్టి తిరుపతి, జోనల్ కార్యదర్శి దాసరి రమేష్, మండల కార్యదర్శి ప్రణయ్, అంతర్జాతీయ క్రీడాకారుడు గెల్లు మధుకర్, వివిధ మండలాల నుంచి వచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.