26 July, 2026 | 1:15 PM

తాగునీటి సమస్య పరిష్కరిస్తాం

31-05-2024 12:22 AM

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

కూకట్‌పల్లి, మే 30 : ఆల్విన్‌కాలనీ డివిజన్ మొగులమ్మ బస్తీ కాలనీలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనులపై గురువారం కాలనీ వాసులు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. కాలనీలో ప్రధానంగా తాగునీటి సమస్య తలెత్తుతుందని తక్కువ ప్రెజర్‌తో తాగునీరు వదలడంతో నీరు సరిపోవడంలేదని ఆయన దృష్టికి తీసుకువచ్చా రు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత జలమండలి అధికారులకు ఫోన్ ద్వారా సమస్యను వివరించి తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.

వేసవికాలం దృష్టిలో ఉంచుకుని అధికారు లు ఆయా కాలనీలో నెలకొన్న వివిధ సమస్యలతో పాటు అసంపూర్తిగా మిగిలిపోయిన అభివృద్ధి పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే కాలనీలో పర్యటించి తన దృష్టికి తీసుకొచ్చిన ప్రతీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు జాన్, కాలనీ వాసులు పాల్గొన్నారు.