calender_icon.png 23 November, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగ్‌పూర్‌ ఆగ్రోవిజన్ 2025లో మహీంద్రా కొత్త ట్రాక్టర్ల ప్రదర్శన

23-11-2025 07:35:20 PM

ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ట్రాక్టర్లను తయారు చేసే దిగ్గజ సంస్థ మహీంద్రా & మహీంద్రా, నాగ్‌పూర్‌లో ఆగ్రోవిజన్ 2025లో ప్రత్యామ్నాయ ఇంధన ట్రాక్టర్లు, టెక్నాలజీలను ప్రదర్శించింది. నాగ్‌పూర్ ఆగ్రోవిజన్ ప్యాట్రన్‌గా కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్య అతిథిగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆగ్రోవిజన్ 2025లో తాజా ఆవిష్కరణలు, సుస్థిర ట్రాక్టర్ టెక్నాలజీలను మహీంద్రా ప్రదర్శించింది. మహీంద్రా యొక్క యువో టెక్+ ట్రాక్టర్ ప్లాట్‌ఫాంపై రూపొందించిన ఈ సరికొత్త సీఎన్‌జీ/సీబీజీ ట్రాక్టరు ఇటు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ), కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) మరియు డ్యుయల్ ఫ్యుయల్ (డీజిల్-సీఎన్‌జీ)పై పని చేస్తుంది.

అలాగే మహీంద్రా రూపొందించిన ఈ సరికొత్త ప్రత్యామ్నాయ ఇంధన టెక్నాలజీలో ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ అనేది చెరకు, మొక్కజొన్న, మొక్కజొన్న పొట్టు, మొక్కల దుబ్బు, పంట వ్యర్ధాలు, ఇతరత్రా వ్యవసాయ ఆధారిత వనరుల నుంచి తీసిన ఇథనాల్‌పై పని చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. మహీంద్రా యొక్క అంతర్జాతీయ స్థాయి తేలికపాటి ట్రాక్టర్ ప్లాట్‌ఫాం మహీంద్రా ఓజాపై మహీంద్రా ఎలక్ట్రిక్ ట్రాక్టర్ రూపొందించారు. దీని నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉంటాయి. మెరుగైన టార్క్‌ను అందిస్తుంది. ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్‌తో పాటు వివిధ రకాల అవసరాల కోసం ఉపయోగించుకునేలా అత్యంత సమర్ధవంతమైనదిగా ఉంటుంది. పర్యావరణహితంగా ఉండే, స్మార్ట్ సాగు సాధనాలను రూపొందించడంలో, ప్రత్యామ్నాయ ఇంధన టెక్నాలజీలవైపు భారత్ మళ్లే ప్రక్రియకు సారథ్యం వహించేందుకు మహీంద్రా కట్టుబడి ఉందని కంపెనీ ప్రెసిడెంట్ విజయ్ నక్రా తెలిపారు.