calender_icon.png 9 August, 2025 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వసూళ్ల కోసం బెదిరింపులు

09-08-2025 01:15:57 AM

- మామూళ్లు ఇవ్వకుంటే బిల్డింగ్స్

- కూల్చివేస్తామని వార్నింగ్

- మణికొండ మున్సిపాలిటీకి అపకీర్తి

- కమిషనర్ ఆదేశాలు బేఖాతర్

- భయభ్రాంతులకు గురవుతున్న బిల్డర్స్

మామూళ్ల కోసం అక్కడ కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇవ్వకుంటే బి ల్డింగ్స్ కూల్చివేస్తామని ఏకంగా వార్నింగ్ ఇస్తున్నారు. ఇది ఎక్కడో కాదు మణికొండ మున్సిపాలిటీలో జరుగుతున్న తతంగం. వా రి వెనక ఓ అధికారి ఉండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిస్తున్నాయి. 

మణికొండ, ఆగస్టు 8: మణికొండ ము న్సిపాలిటీ రాష్ట్రంలో ప్రఖ్యాత మున్సిపాలిటీల్లో ఒకటి. అలాంటి మున్సిపాలిటీకి అపకీ ర్తి తెచ్చేలా కొందరు సిబ్బంది వ్యవహరిస్తున్నారు. అంకితభావంతో పనిచేయాల్సిన ఆ సిబ్బంది, లంచాలతో టౌన్ ప్లానింగ్ విభాగానికే మచ్చ తీసుకొస్తున్నారు. కమిషనర్ ఆదేశాలు బేకాతర్ చేస్తూ తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అక్రమ వసూళ్ల కోసం బిల్డర్స్ ను బెదిరిస్తూ వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.

ఈ అక్రమ వసూళ్ల వె నక, అక్రమ నిర్మాణాల వెనక ఓ షాడో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. అల్కాపురి కాలనీ, వినాయక్ నగర్, వెంకటేశ్వర కాలనీ, డాలర్ హిల్స్ లో జోరు గా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. వీ టి పరిశీలనకు వెళ్లిన నెపంతో కొందరు సి బ్బంది బిల్డర్స్ ను డబ్బుల కోసం బెదిరిస్తున్నారు. ఇవ్వకుంటే అక్కడి నిర్మాణ సామగ్రి అయిన పారలు, గంపలు, కటింగ్ మిషన్స్, సెంట్రింగ్ పరికరాలు ఎత్తుకెళ్తున్నారు. మళ్లీ జేబులు తడిపితేనే ఆ నిర్మాణ సామగ్రి తిరిగి ఇస్తున్నారు. లేకుంటే వారి బిల్డింగ్స్ కూల్చివేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇప్పటికే అనేకసార్లు ఇలాంటి ఘటనలు జరిగినట్లు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.

అధికారుల నిర్లక్ష్యం

మున్సిపాలిటీలో జరిగే నిర్మాణాలపై ము న్సిపాలిటీ టౌన్ ప్లానింగ్, అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. కానీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. భవనాలు పూర్తయినా అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు అంటున్నారు.

కఠిన చర్యలు తీసుకుంటాం 

మున్సిపాలిటీ పరిధిలో పలుచోట్ల అక్రమ నిర్మాణాలు జరుగుతున్న మాట వాస్తవమే. మా సిబ్బంది ఎక్కడైనా అక్ర మ వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం వస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

 మున్సిపల్ కమిషనర్