09-08-2025 11:38:40 AM
మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : బ్రిటిషర్లను భారతదేశం నుంచి తరిమి కొట్టడమే ధ్యేయంగా పెట్టుకుని క్విట్ ఇండియా ఉద్యమాన్నికి(Quit India Movement) అంకురాపురం చేసిన రోజు ఈరోజేనని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి(Devarakadra MLA Madhusudhan Reddy) అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన రోజు కావడంతో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ ఎనలేని సేవలు అందించిందని, దేశాభివృద్ధిలో నెహ్రూ మరియు ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ఆర్థిక సంస్కరణలు పెద్ద ఎత్తున తీసుకొచ్చిన సంగతిని గుర్తు చేస్తూ పార్టీ అభివృద్ధికి రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికల్లో మన సత్తా చాటాలని చెప్పారు.
ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలి..: ఎమ్మెల్యే జిఎంఆర్
నాడు ఎంతో పోరాటం చేస్తేనే భారతదేశానికి స్వరాజ్యం దక్కిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధు సార్ రెడ్డి స్పష్టం చేశారు. యువత నాడు జరిగిన పరిస్థితులను పూర్తిస్థాయిలో తెలుసుకొని ముందుకు అడుగుల వేస్తేనే అభివృద్ధి మరింత వేగంగా జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం, బ్రిటిషు పాలనను అంతం చేయాలని డిమాండ్ చేస్తూ, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఆగస్టు 8 న మహాత్మా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాంబే సమావేశంలో ప్రారంభించిన ఉద్యమన్నారు. నాడు బొంబాయిలో గోవాలియా ట్యాంక్ మైదానంలో చేసిన క్విట్ ఇండియా ప్రసంగంలో గాంధీ డూ ఆర్ డై కి సిద్ధం కావాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ భారతదేశం నుండి "క్రమబద్ధమైన బ్రిటిషు ఉపసంహరణ" కోరుతూ భారీ నిరసనను శ్రీకారం చుట్టిందని, యుద్ధంలో మునిగి ఉన్నప్పటికీ, దీనిపై చర్య తీసుకోవడానికి బ్రిటిషు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నాడు మహాత్మా గాంధీప్రసంగించిన గంటల్లోనే భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం పూర్తిస్థాయిలో ఎలాంటి విచారణ లేకుండానే జైల్లో వేయడం జరిగిందన్నారు.
వీళ్ళలో చాలా మంది యుద్ధం ముగిసేదాకా జైలులోనే, ప్రజలతో సంబంధం లేకుండా జీవనం కొనసాగించాలని పేర్కొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం మనిషి మనుగడ ఉన్నంతవరకు పదిలంగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబెద్దుల కొత్వాల్, గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ బెక్కరి అనిత, ఎన్పీ వెంకటేష్, వినోద్ కుమార్, చంద్రకుమార్ గౌడ్, సిరాజ్ ఖాద్రి, ఫయాజ్, ఎస్సీ సెల్ సాయిబాబు, అజ్మాత్, సేవాదళ్ ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు._