calender_icon.png 9 August, 2025 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీలోకి గువ్వల

09-08-2025 01:26:34 AM

  1. 10న ముహూర్తం 
  2. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో గువ్వల భేటీ
  3. సిట్టింగ్‌లూ టచ్‌లో ఉన్నారన్న బీజేపీ చీఫ్

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): రాష్ట్రంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం బీజేపీలో చేరేందుకు గాను తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం కాషాయదళంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈ నెల 10న బీజేపీలో చేరనున్నట్లు ఆయన వెల్లడిం చారు.

ఈ మేరకు గువ్వల బాలరాజు శుక్రవారం  తార్నాకలోని టీబీజేపీ చీఫ్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. పార్టీలో చేరిక అంశంపై ఇరువురు చర్చించుకున్నారు. ఉమ్మ డి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాలు సైతం ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. అనంతరం ఇదే అంశంపై రాంచందర్‌రావు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం బీజేపీలోకి చేరేందుకు తమతో టచ్‌లో ఉన్నారని, అయితే వారి పదవీకాలం పూర్తయ్యాకే పార్టీలోకి రావాలని తాము సూచించినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ నాయకత్వంపై నమ్మకం కోల్పో యిన ఆ పార్టీ నేతలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ కనిపిస్తోందన్నారు. ప్రస్తుతం తమతో మాట్లాడుతున్న ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేల సంఖ్య మ రింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

గువ్వల బాలరాజు చేరికతో వలసల సంఖ్య పుంజుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసును రాష్ట్ర ప్రభుత్వం విచారిస్తున్న తీరు సరిగా లేదని, ఈ కేసును సీబీఐకు అప్పగిస్తేనే నిజమైన దోషులకు శిక్ష పడుతుందని అభిప్రాయపడ్డారు. ఓటమి భయంతోనే సీఎం రేవంత్‌రెడ్డి లోకల్‌బాడీ ఎన్నికలను నిర్వహించేందుకు భయపడుతున్నారని అన్నారు. బీసీ రిజ ర్వేషన్ల పేరిట సీఎం ఆడుతున్న నాటకాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈసీపై రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలు ఆయన అసహనానికి పరాకాష్ఠగా అభివర్ణించారు.