09-08-2025 11:41:17 AM
మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని(Manthani Mandal) ఖాన్ సాయిపేటలో శనివారం తెల్లవారుజామున ఒక్కసారి వర్షంతో పాటు పిడుగులు పడగా గ్రామానికి గొర్ల మేకలను మేత కోసం తోలుకొని వచ్చిన అన్న ఎల్లయ్య కు చెందిన మేకలు, గొర్రెలు అటవీ సమీపంలో ఉన్న గొర్ల మందపై పిడుగు పాడటంతో ఒక మేకతో పాటు 15 గోర్లు మృతి చెందాయి. మంచిర్యాల జిల్లా బోత్ మండలానికి చెందిన ఎల్లయ్య గొర్ల మేకలను తోలుకొని మేత కోసం ఇక్కడికి వలసకు రాగా, పిడుగుపాటుతో గొర్లు మృతి చెందడంతో తీవ్రంగా నష్టపోయాడు. ప్రభుత్వం తనకు నష్టపారిహారం అందించాలని బాధితుడు వేడుకుంటున్నారు.