09-08-2025 12:21:32 PM
బిచ్కుంద, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు లాలయ్య అకాల మరణం చెందారు. ఆయన భౌతికకాయానికి శనివారం సీఐటీయూ జిల్లా నాయకులు సురేష్ గొండతో పాటు మున్సిపల్ సిబ్బంది, కార్మికులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లాలయ్య కుటుంబానికి అంత్యక్రియల నిమిత్తం రూ.20,000 ఆర్థిక సహాయం అందించారు. కార్మికులతో కలిసి మౌనం పాటించి, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఇందులో మున్సిపల్ సిబ్బంది వీరేశం, గణేష్, మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు భూమయ్య,కార్యదర్శి రాజు, కార్మికులు సుశీల భాయ్, గంగవ్వ, మాణిక్ సాయిలు, కార్మికులు పాల్గొన్నారు.