09-08-2025 12:33:38 PM
హైదరాబాద్: క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) శనివారం నాడు గాంధీ భవన్ లో జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. సేవదళ్ చైర్మన్ జితేందర్ ఆధ్వర్యంలో నాయకులకు స్వాగతం లభించింది. స్వాతంత్య్ర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమం కీలకమైనదని మహేష్ గౌడ్ అన్నారు.
డూర్ ఆర్ డై(Do or die) నినాదంతో గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం(Quit India Movement) ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ కాంగ్రెస్ చరిత్రను తుడిచివేయాలని, రాజ్యాంగం మార్చాలని చూస్తోందని మహేష్ గౌడ్ ఆరోపించారు. రాజ్యంగ సంస్థలతో ప్రతిపక్షాలపై కుట్ర పూరిత దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ బీజేపీకి ఫ్రంటల్ ఆర్గనైజషన్ గా మారిందని ద్వజమెత్తారు. ప్రశ్నిస్తే దేశ ద్రోహులని ముద్ర వేస్తున్నారని వివరించారు. క్విట్ బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్తు అని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశ రక్షణ కోసం పనిచేస్తోందని సూచించారు.