calender_icon.png 9 August, 2025 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ రోడ్డుపై నడిచేదెలా?

09-08-2025 12:58:21 AM

-బురదమయంగా పల్లె రహదారులు

-వానకాలం వస్తే నరకమే

-సీసీ రోడ్లు వేయాలని విజ్ఞప్తులు

కన్నాయిగూడెం, ఆగస్టు8(విజయక్రాంతి) : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం-ముప్పనపల్లి గ్రామాలలో ఉన్న రోడ్లు బురుదమయ మైనాయి కావిరి నాగయ్య(దిలీప్)ఇంటి నుంచి బుట్టాయిగూడెం పాత ఆశ్రమ హస్టల్ వరకు ఉన్న ఈ రోడ్డు వ్యవసాయ పనులకు పోవాడానికి రైతులు ఉపయోగిస్తారు ఈ రోడ్డు కొద్ది పాటి ముసుర్లకే బురదమయమై రైతులు, ప్రజలు నడవడానికి వీలు లేని స్థితిలో ఉంది.కొద్ది పాటి ముసుర్లకే వాహనాల చక్రాలకు మట్టి చుట్టుకుని ద్విచక్రవాహనాలు ఈ రహదారిపై నుంచి వెళ్ల లేకపోతున్నాయని ఈ రోడ్డుపై ఇప్పటి వరకు తట్టెడు మట్టి పోయాలేదని గ్రామ ప్రజలు ఆరోపించారు.వ్యవసాయం పొలం పనులకు వద్దకు వెళ్లే రైతులు ఎక్కువగా ఈ దారి నుంచే వెళతారన్నారు.

రోడ్డు బురదమయమై వారు వ్యవసాయ పనులకు వద్దకు, ఇతర చోట్లకు వెళ్లడానికి నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు.ముప్పనపల్లి గ్రామంలోని జనగం చిరంజీవి ఇంటి నుంచి నామని సంతోష్ ఇంటి వరకు ముప్పనపల్లి గ్రామంలో ఇంకా చాలా రోడ్లు ఇదే పరిస్థితితో వర్షానికి జలమయమవుతున్నాయి అనంతరం బురదమయంలో ఉంటున్న ఇలాంటి రోడ్లన్ని సీసీ రోడ్లు వేయాలి ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి రోడ్డుపై బురద లేకుండా మొరం పోసి రహదారి బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు అదేవిధంగా బుట్టాయిగూడెం గ్రామంలో ప్రధాన రహదారులపై మురుగు నీరు చెరువును తలపిస్తున్నాయి.కుమ్మరి పెద్దోల వెంకటయ్య కిరాణం ముందు మురుగు నీరు చేరి ఎటుపోకుండా ఉండీ రోడ్డు చెరువులా ఉందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.

సీసీ రోడ్లు వేయాలి

 ప్రజలకు రోడ్ల సౌకర్యాలు మంచిగా ఉంటేనే ఏలాంటి ఇబ్బందులు పడకుండా రోజు వారి పనులు చేసుకునేందుకు వీలుంటుంది రోడ్లు బాగుంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు కొద్దీ పాటి వర్షానికే రోడ్లు బురదమయం అవుతున్నాయి బురదమయం అవుతున్న రోడ్లన్ని సీసీ రోడ్లు వేయాలని బీఆర్‌ఎస్ కన్నాయిగూడెం యూత్ అధ్యక్షుడు నరెడ్ల ఆశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 నరెడ్ల అశోక్, బీఆర్‌ఎస్ కన్నాయిగూడెం యూత్ అధ్యక్షుడు