28 April, 2026 | 9:41 PM

గంజాయి కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్ – 1.085 కిలోల స్వాధీనం

28-04-2026 08:36 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): మండలంలోని న్యూ పద్మగూడెం గ్రామంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1.085 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మణుగూరు డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు సీఐ నాగబాబు నేతృత్వంలో పోలీసులు అనుమానిత ఇంటిలో తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఇంటి యజమాని మిడియం గోవిందును విచారించగా, గుట్టమల్లారానికి చెందిన సాయి అలియాస్ గుట్ట సాయి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. అలాగే సత్తుపల్లికి చెందిన జుజునూరి సింహాద్రి అలియాస్ సందీప్‌కు గంజాయి అమ్ముతున్నట్లు వెల్లడైంది. ఈ మేరకు మిడియం గోవిందు, గుట్ట సాయి, జుజునూరి సింహాద్రి అలియాస్ సందీప్‌లపై కేసు నమోదు చేసి, మిడియం గోవిందును జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు సీఐ నాగబాబు మీడియాకు తెలిపారు. పోలీసులు మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.