ముగ్గురు ఎయిరిండియా అధికారులపై వేటు
న్యూఢిల్లీ: విమాన సిబ్బంది షెడ్యూల్‌కు సంబంధించి పదేపదే ఉల్లంఘనలు జరిగిన నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు చెందిన ముగ్గురు సీనియర్ అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఏవియేషన్ రెగ్యులేటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (Directorate General of Civil Aviation) ఆదేశించింది. నిర్వహణ విధుల్లో అలసత్వం వహించిన ముగ్గురిపై డీజీసీఏ వేటు వేసింది. ఎయిరిండియా వెల్లడించిన విషయాల ఆధారంగా ముగ్గురిపై చర్యలు తీసుకోనుంది. లైసెన్సింగ్, సర్వీసింగ్ లోపాలున్నాసిబ్బందిని షెడ్యూల్ చేయడంపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ చూరాసింగ్(Divisional Vice President Choorah Singh), డీవోపీఎస్ అధికారి పింకీ మిట్లల్, సిబ్బంది షెడ్యూలింగ్, ప్లానింగ్ పాయల్ అధికారి అరోరాపై చర్యలు తీసుకోనుంది. ముగ్గురు అధికారులు విమాన లోపాలను పట్టించుకోకుండా అలసత్వం వహించారు. లైసెన్సింగ్ నిబంధనలు ఉల్లంఘించినా అధికారులు పట్టించుకోవలని డీజీసీఏ వెల్లడించారు.






