మూడున్నర టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
11-12-2024 12:24 AM
నిజామాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): నిజామాబాద్ నగర శివా రులోని ఆరోటాన్ పరిధిలో అక్రమం గా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. బియ్యం తరిస్తున్న సోహెల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన బియ్యం మూడున్నర టన్నులకు పైగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.






