calender_icon.png 4 July, 2025 | 1:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

04-07-2025 08:20:56 AM

  1. రెండు లారీలు ఢీ 
  2. ముగ్గురు సజీవ దహనం?

మహబూబాబాద్, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై మరిపెడ మండలం కుడియ తండా సమీపంలో గ్రానైట్ లారీ, చేపల దానాతో వెళ్తున్న మరో లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగి రెండు లారీలలోని డ్రైవర్లతోపాటు మరో వ్యక్తి సజీవ దహనం అయినట్లు సమాచారం. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని  మంటలను ఆర్పుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.