వీడిన హత్య మిస్టరీ
కేసు వివరాలు వెల్లడించిన డిఎస్పి మొగులయ్య....
అయిజ : గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని మాల పేటలో ఈనెల 1న జరిగిన వడ్ల సరోజహత్య కేసును పోలీసులు చేదించారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ మొగులయ్య తెలిపిన వివరాల ప్రకారంగా ఆమె భర్త రామాచారి కుమారుడు వినోదాచారి కలిసి హత్య చేసినట్లు తెలిపారు.. సరోజ కు 2001లో ధరూర్ మండలం రామాచారి తో వివాహం జరిగింది.. వారికి ఇద్దరు కుమారులు ఒక కూతురు పుట్టింది. అటు తరువాత సరోజ ప్రవర్తన మారడంతో భర్త పలుమార్లు నచ్చ చెప్పాడు. ఆమె వినకపోవడంతో పెద్దల సమక్షంలో విడిపోయారు.
రామాచారి కర్నూలు జిల్లా కోస్గి మండలం కౌతాళం సుజాతతో పెళ్లి చేసుకుని అక్కడే ఉంటున్నాడు. అప్పుడప్పుడు పిల్లలను చూసేందుకు వచ్చి వెళ్లేవాడు. అయితే ఆమె పెద్ద కుమారుడుకు వినోదాచారికి పెళ్లి సంబంధాలు చూసేందుకు ప్రయత్నించగా తల్లి ప్రవర్తన సరిగా లేదని కొన్ని సంబంధాలు విడిపోయాయి. దీంతో తండ్రి కుమారుడు ఒకటయ్యారు. ఈనెల 1న కుమారుడు వినోదాచారి ఇంటి వద్ద తల్లి ఒంటరిగా ఉన్న సమయంలో తండ్రికి ఫోన్ చేశాడు. మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో గొడవ పడి తలను గోడకు కొట్టి గొంతు నులిమి హత్య చేసి అక్కడినుండి పారిపోయారని డి.ఎస్.పి తెలిపారు. మృతురాలి చిన్న తమ్ముడు నరసింహ చారి, ఫిర్యాదు మేరకు శాంతినగర్ సిఐ టాటా బాబు,ఐజా ఎస్సై శ్రీనివాసరావు దర్యాప్తు చేపట్టి రెండు రోజుల్లో కేసును చేదించి నిందితులను అదుపులోకి వారిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలిస్తామన్నారు.






