9 April, 2026 | 11:45 AM

పాడి కౌశిక్‌రెడ్డిపై మరో కేసు

08-12-2024 01:11 AM

శేరిలింగంపల్లి, డిసెంబర్ 7 (విజయక్రాంతి): హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గచ్చిబౌలి పీఎస్‌లో మరో కేసు నమోదైంది. బంజారాహిల్స్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించి బెదిరించినందుకు కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రెండ్రోజుల క్రితం అరెస్ట్ కోసం పోలీసులు వెళ్లినప్పుడు .. తనను అరెస్ట్ చేస్తే చనిపోతానంటూ కౌశిక్‌రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారని తాజాగా మరో కేసు నమోదు చేశారు. బుధవారం బంజారాహిల్స్ పీఎస్‌కు తన అనుచరులతో కలిసి వెళ్లిన కౌశిక్‌రెడ్డి హంగామా సృష్టించారు. విధులపై బయటకు వెళ్తున్న సీఐ రాఘవేంద్రను తన కంప్లుంట్ తీసుకోవాల్సిందేనం టూ అడ్డుకున్న వాగ్వాదానికి దిగాడు. ఈ సమయంలో రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో గురువారం కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆ సమయం లో తనను అరెస్టు చేస్తే చనిపోతానని బెదిరించినట్లు పోలీసులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా కౌశిక్‌రెడ్డిపై మరో కేసు నమోదైంది.