11 August, 2026 | 1:20 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

అల్లూరి జిల్లాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి

18-06-2025 09:21 AM

అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Sitharama Raju District) రంపచోడవరం, మారేడుపల్లి దేవీపట్నం అటవీ ప్రాంతంలోని కొండమొదలు వద్ద ఎన్ కౌంటర్(Encounter) జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్, జోన్ జోన్ కమిటీ సభ్యురాలు అరుణ, ఇటీవల ఎన్ కౌంటర్ లో మృతి చెందిన చలపతిరావు భార్య అరుణ, ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ ఏసీఎం(AOB Special Zone Committee ACM) అంజు మృతి చెందారు. గ్రేహౌండ్స్ సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టుల నుంచి 3 ఏకే 47 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోము హత్య కేసులో అరుణ నిందితురాలు. 2018లొ దుండ్రిగూడ సమీపంలో కిడారి సర్వేశ్వరరావు , సివేరి సోము హత్య జరిగింది. అరుణ స్వస్థలం విశాఖ జిల్లా పెందుర్తి మండలం కకరవాణిపాలెం. ఉదయ్ పై రూ. 25 లక్షలు, అరుణపై రూ. 20 లక్షల రివార్డు ఉందని అధికారులు పేర్కొన్నారు.