calender_icon.png 16 October, 2025 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తండ్రిని చంపింది తనయుడే

16-10-2025 01:33:56 AM

-నిందితుడు మైనర్ బాలుడు

-గొడ్డలితో నరికి చంపి పాతిపెట్టిన వైనం

-లక్ష్మణ్ హత్య కేసులో వీడిన మిస్టరీ: ఎస్పీ వెల్లడి

భైంసా, అక్టోబర్ 15: చేతికి వచ్చిన కొడుకును బాగా చదువుకోవాలన్నారు. తప్పు చేస్తే మందలించాడు. దారితప్పిన కొడుకును దారి లో పెట్టేందుకు ప్రయత్నించిన కన్నతండ్రిని గొడ్డలితో నరికి పంట చేన్లోనే పాతిపెట్టిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ బాలుడు మైనర్ కావడంతో సంచలనం సృష్టించింది. జిల్లా ఎస్పీ జానకి షర్మిల బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు.

బైంసా సబ్ డివిజన్లోని తానూర్ మండలం ఎల్వి గ్రామానికి చెందిన వన్నేవాడ లక్ష్మణ్(45) ఆగస్టు 31న పంట చేనులోకి వెళ్లి అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యులు లక్ష్మణ్ ఆచూకీ కోసం బం ధువుల ఇంట్లో వద్ద తెలిసిన ప్రదేశాలు గాలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మర్నాడు తానూర్ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు కింద నమోదు చేశారు.

లక్ష్మణ్ గుర్తించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. గాలింపు చర్యలు చేపట్టిన ప్రయోజ నం లేకపోవడంతో కుటుంబ సభ్యులపై అనుమానం వచ్చి అన్ని కోణాల్లో విచారణ జరిపా రు. కొడుకు ప్రవర్తన పై అనుమానం రావడం తో పోలీసులు అతని విచారించి వాస్తవాలు రాబట్టేందుకు ప్రయత్నించినప్పటికీ అతను చేసిన నేరాన్ని తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు.

లక్ష్మణ్ ఆచూకీ ఎక్కడ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆం దోళన చెందుండగా రెండు రోజుల క్రితం పం ట చేన్లో ఓ గోతివద్ద కుక్కలు తవ్వగా మనిషి శరీరానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించడం పాలిథిన్ కవర్ ఉండడం గుంత ఏర్పడ డంతో పోలీసులు అక్కడికి వెళ్లి అన్ని కోణాల్లో విచారణ చర్పడం జరిగిందన్నారు. మంగళవారం గుంత తవ్వగా అక్కడ పుర్రె ఎముకలు లక్ష్మణ్ కు చెందిన వాళ్లు కల్పించడంతో విచారణ చేపట్టగా కొడుకు తాను నేరం చేసినట్టు ఒప్పుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ వెల్లడించారు.

తనను తరచుగా మందలించడం చుల కన చేసి మాట్లాడడం ఇబ్బంది పెట్టడం జీర్ణించుకోలేక పంటచేల్లో పనికి వెళ్లిన తండ్రిపై ఆగస్టు 31న గొడ్డలితో దాడి చేసి హ హతమార్చినట్టు విచారణలో తేలింది అన్నారు. తండ్రి చనిపోవడంతో ఈ విషయం బయటపక్కకుండా గడ్డపార పావుడా తీసుకొచ్చి చేను పక్కన ఉన్న లోయలో గుంత తవ్వి అక్కడ పూడ్చిపెట్టి ఎవరికీ అనుమానం రాకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలిసిందన్నారు. తండ్రిని చంపిన కుమారుడు వయసు మైనర్ కావడం అతను చేసిన హత్య శవాన్ని పూడ్చివేసిన ఘటన అక్కడి ప్రజలను టీవీల సం చలనానికి గురిచేసింది.

మైనర్ బాలుడు ఇటువంటి ఘాతుకానికి పాల్పడ పై జిల్లా పోలీసు యంత్రాంగం సైతం విస్తు పోయింది. నేరం ఒప్పుకోవడంతో సంఘటనకి కుమారుని తీసుకెళ్లిన పోలీసులు అక్కడ హత్య చేసిన విధానా న్ని తెలుసుకొని నిన్దితుడుని జువైనల్ కోర్టుకు పంపడం జరిగిందని ఎస్పీ వెల్లడించారు. బాలనేరస్తుల చట్టం ప్రకారం నేరాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు చర్య పట్టినట్టు తెలిపారు.

ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఏవైనా ఇబ్బందులు ఉంటే పోలీసులను సంప్రదించి సహాయం పొందాలని ఎస్పీ వెల్లడించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకు న్న ఏఎస్పీ అవినాష్ కుమార్ ముధోల్ సిఐ మల్లేష్ స్థానిక ఎస్సైలను ఎస్పీ జానకి షర్మిల అభినందించారు హత్యకు ఉపయోగించిన గొడ్డలి గడ్డపార ఇతర పది ముట్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్పీ వెల్లడించారు.