11-02-2026 12:49:20 AM
సిద్దిపేట క్రైం, ఫిబ్రవరి 10 : సిద్దిపేట పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఆరుగురు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మంగళవారం వారిని సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరు పరిచినట్టు చెప్పారు .
న్యాయమూర్తి విచారణ జరిపి, నలుగురికిరూ.40వేల జరిమానా, ఒకరికి అయిదు రోజులు, మరొకరికి రెండు రోజుల జైలు శిక్ష విధించారని పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఒకరికి రూ. 5వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
వన్ టౌన్ పరిధిలో...
కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలోని పలు చౌరస్తాలలోవాహనాలు తనిఖీ చేయగా, పొన్నాల గ్రామానికి చెందిన మచ్చ తిరుపతిరెడ్డి అనే వ్యక్తి మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు తెలిపారు. మంగళవారం అతడిని న్యాయమూర్తి కాంతారావు ఎదుట హాజరు పరచగా, విచారణ జరిపి ఐదు రోజుల జైలు శిక్ష విధించారని పేర్కొన్నారు.