19-07-2024 05:06:23 PM
మహబూబ్నగర్: కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మహబూబ్ నగర్ పట్టణం లోని వార్డు నెం 37 నుంచి ఖాలీద్, షకీల్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు శుక్రవారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టి పిసిసి ప్రదాన కార్యదర్శి వినోద్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాయిబాబా, ఐఎన్టియుసి రాములు యాదవ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.