కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం.. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు ఆత్మహత్య
04-07-2026 01:35 PM
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఆత్మహత్య
కృష్ణా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా(Krishna district) జిల్లా గూడూరు మండలం అనంతాయిపేట గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మరణించిన వారిని రజని (60), ఆమె కుమార్తె గౌరి (40), కోడలు మధు (35)గా గుర్తించారు. పోలీసుల సమాచారం ప్రకారం, వీరు ముగ్గురూ తమ నివాసంలో ఉరివేసుకుని కనిపించారు. కుటుంబ వివాదాల కారణంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ విషాద ఘటనపై గూడూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు.






