26 June, 2026 | 6:16 PM

Breaking News

సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •   Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం   •   డ్రగ్స్ కేసులో దొరికితే.. ఎంతటి వారైనా వదిలిపెట్టం: భట్టి విక్రమార్క   •   బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి పునః ప్రతిష్ట   •   వర్షాలు కురవాలని మడేలేశ్వర స్వామికి జలాభిషేకం   •  

ఆలయానికి వెళ్లొస్తుండగా ప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి

13-04-2025 09:13 AM

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా(Sathya Sai district )లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను తక్షణమే హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సత్యసాయి జిల్లా పరిగి మండలం ధనాపురం క్రాస్ హైవే(Dhanapuram Cross Highway)పై ఈ ఘటన చోటుచేసుకుంది.

మృతులను అలివేలమ్మ(45), ఆదిలక్ష్మమ్మ(65), శాకమ్మ(60)గా గుర్తించారు. ప్రమాదం జరిగినప్పుడు ఆటోలో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. బాధితులను రోద్దం మండలం దొడగట్ట వాసులుగా గుర్తించారు. ఆటోలో చౌడేశ్వరి ఆలయానికి(Chowdeshwari Temple) వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.