calender_icon.png 12 November, 2025 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాహేతర సంబంధం..వ్యవసాయ పొలంలో చంపి పడేశారు

13-04-2025 09:01:14 AM

హైదరాబాద్: వరంగల్ జిల్లా(Warangal district) నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. బానోతు కుమ్మాలు(36) అనే వ్యక్తిని గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో దుండగులు కత్తితో పొడిచి చంపేశారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం ఈ హత్య జరగడానికి పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.