17 August, 2026 | 6:05 AM

దడ పుట్టిస్తున్న బైక్ రేసింగ్

17-06-2024 12:39 AM
  • హైదరాబాద్ నడిబొడ్డున యువకుల హల్‌చల్

పోలీసులు దృష్టి సారించాలని స్థానికుల డిమాండ్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 16 (విజయక్రాంతి): రాత్రయితే చాలు హైదరాబాద్ నడిబొడ్డున కొందరు యువకులు హై సీసీ బైక్‌లు వేసుకుని రోడ్డు మీదకు వస్తున్నారు. మైకం కమ్మిన విధంగా పోటాపోటీగా బైక్‌లు నడుపుతూ స్థానికులకు దడపుట్టిస్తున్నారు. కొందరైతే ఏకంగా బైక్ రేసింగ్ పోటీ లు పెట్టుకుని విచక్షణారాహిత్యంగా బైక్‌లు నడుపుతున్నారు. మాడిఫైడ్ సైలెన్సర్లతో భీకర శబ్దాలు చేసుకుంటూ బైక్ నడుపుతున్నారు.

ఒకప్పుడు నగర శివారులో ఈ బైక్ రేసింగ్ జరగగా, ఇప్పుడు అవి సిటీ మధ్యకు వచ్చాయి. రేసింగ్‌లో పాల్గొనే వారిలో సంప న్న వర్గాలకు చెందిన పిల్లలే అధికం. వీకెండ్ వస్తే చాలు వీరంతా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదు ర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో బైక్ రేసింగ్స్ ఎక్కువగా నడుస్తున్నాయి. మద్యం తాగి కొందరు, మాదక ద్రవ్యాలు తీసుకుని బైక్‌లు నడుపుతున్నట్లు ఆరోపణలున్నాయి.

50 మంది బైకర్లపై కేసు..

రాయదుర్గం పోలీసులు శనివారం ఒక్కరోజే 50 మంది బైకర్లపై కేసులు నమోదు చేశారు. బైక్ రేసింగ్‌తో బైకర్ల ప్రాణాలకే కాదు, రోడ్డుపై ప్రయాణించే ఇతర ప్రయాణికులకూ ప్రాణాంతకమే. ఏదైనా ప్రమా దం జరిగినపుడు హడావుడి చేసే పోలీసు లు, ప్రమాదం జరగకముందే బైక్ రేసింగ్స్ ను అరికట్టాలని నగరవాసులు కోరుతున్నారు.