11-02-2025 01:02:49 AM
కామారెడ్డి ఫిబ్రవరి 10(విజయ క్రాంతి): నిజామాబాద్, మెదక్ ,కరీంనగర్, అదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థిగా మంద జ్యోతి సోమవారం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా ధర్మ సమాజ పార్టీ నాయకులు హాజరై ర్యాలీలో పాల్గొన్నారు వారు మాట్లాడుతూ అన్నగారిన వర్గాల పక్షాన పోరాడుతున్న మంద జ్యోతి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. మిగతా అన్ని పార్టీలు రెడ్లకే టికెట్ కేటాయించారని మండిపడ్డారు.