26-11-2025 12:18:37 AM
* రూ. 6,000 కోట్లతో ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకం.. జూన్ 2కి ముందే ఆగిపోయింది.
* దరఖాస్తులు 16 లక్షలకుపైనే. లబ్ధిదారుల జాబితాలూ సిద్ధం.
* నిధులు లేక నిలిచిపోయిన పథకం.
* కాంగ్రెస్ ప్రభుత్వ 2వ వార్షికోత్సవ వేళ లక్షలాది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువత ఎదురుచూపులు.
హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో సాగి న తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థు లు, నిరుద్యోగులు ఎంతో కీలక పాత్ర పోషించా రు. వందలాది మంది అమరులు కూడా అయ్యా రు. తెలంగాణ కల సాకారమైంది. కానీ నిరుద్యోగులకు మాత్రం ఉపాధి కల్పించడంలో నిర్లక్ష్యం కనిపిస్తున్నది. ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి, అధికారం చేపట్టడంతో నిరుద్యోగుల పాత్ర అధికంగా ఉంది.
దీనికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగు లకు స్వయం ఉపాధి కల్పించడంలో భాగంగా ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రకటించింది. కానీ రోజులు గడుస్తున్నా ‘రాజీవ్ యువ వికా సం’ పథకానికి సంబంధించి ముందడుగు పడ టం లేదు. నిరుద్యోగుల కోసం పథకాలను ప్రకటించడంలో చూపించిన ప్రాధాన్యత అమలులో మాత్రం కనిపించడం లేదని, కాం గ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు మొండిచేయి చూపిస్తున్నదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దీంతో నిరుద్యోగులకు చేకూరాల్సి న లబ్ధి జరగలేదు. అయితే ప్రభు త్వ ఉద్యోగాలు పక్కనబెడితే కనీ సం స్వయం ఉపాధి అయినా పొందాలనుకున్న నిరుద్యోగుల ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేండేళ్లు గడుస్తున్న సందర్భంగా ప్రజాపాలన వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో ‘రాజీవ్ యువ వికాసం’ పథకంపై అమలు ఎప్పుడని నిరుద్యోగుల్లో తీవ్రంగా చర్చ జరుగుతున్నది.
ప్రకటనకే పరిమితం..
నిరుద్యోగులకు ఉపాధి మార్గా న్ని చూపించడంలో భాగంగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రకటించారు. రాష్ర్ట అవతరణ దినోత్సవం అయిన జూన్ 2, 2025వ తేదీన ఘనంగా ప్రారంభించాలని ప్రభుత్వం ప్లాన్ చేసిం ది. స్వయం ఉపాధి కల్పించడంలో భాగంగా రాష్ట్రంలోని 5 లక్షల మంది యువతకు ఒకొ ్కక్కరికి రూ. 4 లక్షల వరకు ఆర్థిక సహాయం ఇస్తామని హామీ ఇచ్చింది.
కానీ ఈ పథకం పట్టాలెక్కలేదు. ఎవరూ ఊహించని విధంగా ప్రారంభం కాకుండానే నిలిచిపో యింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లక్షలాది యువత ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు జల్లింది. వాస్తవానికి ఈ పథకానికి సంబంధించి చాలా ఘనంగా ప్రకటించారు. 2025 మార్చిలో హైదరాబాద్‌లోని మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో భట్టి దీనిని ప్రకటిస్తూ ‘గత పది సంవత్సరాల నిర్లక్ష్యానికి ఇది సమాధానం’ అని కూడా స్పష్టం చేశారు.
దీంతోపాటు ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ. 6,000 కోట్లు కేటాయించినట్టు ప్ర భుత్వం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఈడబ్ల్యూఎస్ వర్తించే 18- 35 ఏళ్ల మధ్య ఉన్న యువత కోసం ప్రత్యేకంగా రూపొందించినట్టు పేర్కొంది. ఈ పథకంలో ప్రభుత్వం మూడు సబ్సిడీ స్లాబ్‌లు పెట్టింది. రూ.1 లక్ష వరకు లోన్‌కు-80 శాతం సబ్సి డీ, రూ. 1- రూ. 2 లక్షలు వరకు లోన్ కు 70 శాతం సబ్సిడీ, రూ. 2- రూ. 3 లక్ష లు వరకు లోన్‌కు 60 శాతం సబ్సిడీ లభిస్తుందని ప్రకటించింది.
కానీ ఆశ్చర్యకరంగా ఎ క్కువమంది అభ్యర్థులు రూ. 4 లక్షల లోన్ కోసం దరఖాస్తు చేశారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు 16.22 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మేడ్చల్-మల్కాజిగిరి లాంటి జిల్లాల్లో అధికారులు కేటగిరీల వారీగా జాబితాలు సిద్ధం చేశారు. గ్రామ సభల్లో వాటిని పరిశీలించాలని ప్లాన్ చేశారు. మహిళలకు 25 శాతం కోటా, దివ్యాంగులకు 5 శాతం కోటా కేటాయించారు.
దీంతో త్వరలోనే రాజీవ్ యువ వికాసం పథకం అమలవుతుందని నిరుద్యోగ యువత ఎంతో ఆశ పడింది. జూన్ 2, 2025 తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సాంక్షన్ లెటర్లు ఇవ్వాలని, తర్వాత ట్రైనింగ్, చెక్కుల పంపిణీ జూన్ మధ్య నాటికి పూర్తిచేయాలని ప్లాన్ చేశారు. కానీ మే చివరి నాటికి పనులన్నీ ఆగిపోయాయి.
పలు సమస్యలతో అమలులో జాప్యం..
ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించినప్పటి కీ రాజీవ్ యువ వికాసం పథకం పలు సమస్యల కారణంగా దారితప్పింది. ప్రభుత్వ ఆర్థి క పరిస్థితి బలహీనంగా ఉండటంతో వెంట నే రూ. 6,000 కోట్లు సిద్ధం కాలేదు. బ్యాం కులు పక్కా గ్యారంటీలు లేక రుణాలు ఇ చ్చేందుకు ముందుకు రాలేదు. దీనికితోడు పథకానికి సిబిల్ స్కోర్ రూపం ప్రధాన స మస్య తలెత్తింది. సిబిల్ స్కోర్ అవసరం లేద ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బహిరంగంగా ప్రకటించినా బ్యాంకులు మాత్రం పూ ర్తి డాక్యుమెంట్లు లేవు, క్రెడిట్ రేటింగ్స్ సరైనవి కావు అంటూ రుణాలను ఆపేశాయి.
దీంతో పథకాన్ని అర్హత సాధించని దరఖాస్తుదారులు ఎంతో ఆవేదనకు లోనైయ్యారు. ఇదిలాఉండగా జిల్లా పర్యటనల సందర్భం గా మంత్రులు జాబితాలో అనర్హుల పేర్లు చెప్పడంతో సీఎం రేవంత్‌రెడ్డి మళ్లీ పూర్తిగా పరిశీలించాలని ఆదేశించారు. దీంతో పథ కం అమలు కోసం సిద్ధంచేసిన జాబితా లు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుత ప రిస్థితుల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల త ర్వాతే రాజీవ్ వికాసం పథకాన్ని అమలు చే యనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
రెండేళ్ల వేడుకల్లో యువత నిరాశ..
డిసెంబర్ మొదటి వారంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజా పాలన వేడుకలను కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ సమయంలో రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేయడంలో జాప్యం కారణంగా యువత ఎంతో నిరాశతో ఉంది. నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు పడుతున్న యువతను స్వయం ఉపాధి దిశగా ప్రభుత్వం తీసుకెళ్తుందని ఆశ పడినప్పటికీ ‘రాజీవ్ యువ వికాసం’ మాత్రం అమలు కానీ హామీగానే మిగిలిపోయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం 7.5 శాతం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిణామాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పొరపాటుగా రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలోని యువతలో ఒక ప్రశ్న తలెత్తుతుంది. ‘రాజీవ్ యువ వికాసం’ పథకం అమలవుతుందా, లేక ఎన్నికల హామీగానే మిగిలిపోతుందా.. అనే అనుమానం వ్యక్తంచేస్తున్నారు.