18-02-2026 12:13:08 AM
సిరిసిల్ల, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘటనలు
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి)/అచ్చంపేట: సిరిసిల్ల జిల్లా ఇల్లంత కుంట మండలం తిప్పాపూర్ శివారులో పెద్ద లింగాపూర్ రైతులు గుర్రాల మల్లయ్యకు చెందిన మూడు ఆవులు, వోరెమ్ సుధాకర్‌కు చెందిన దూడపై పెద్ద పులి దాడి చేసింది. తిప్పాపూర్-పెద్ద లింగాపూర్ రోడ్డు పై కల్వర్టు సమీపంలోని గుట్టలను ఆనుకొని ఉన్న పొలాల వద్ద కట్టి వేసి ఉన్న మూడు ఆవులను, దూడను సోమవారం రాత్రి పెద్ద పులి దాడి చేసి హతమార్చింది.
మంగళవా రం ఉదయం రైతులు తమ పొలాల వద్దకు వెళ్లగా కట్టేసి ఉన్న పశువులు మెడలపై పులి దాడి చేసిన గాయాలతో మృతి చెంది ఉన్నా యి. గత వారం రోజుల క్రితం సిద్దిపేట్ జి ల్లాలోని కోహెడ మండలంలో పులి సంచరిస్తుందన్న విషయం ప్రజలందరికి తెలిసిందే కాగా రెండు గత మూడు రోజులుగా సిద్దిపేట్ జిల్లా చిన్న కోడూర్ మండ లం విఠలా పూర్ , కిష్టాపూర్ ప్రాంతం గు ట్టల్లో పులి సంచారిస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు పులి పాద ముద్రలు నిర్ధారించారు.
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో సంచరిస్తుందని తెలిసిన పులి, సిద్దిపేట్ జిల్లా చిన్నకోడూర్ మండలం విఠలాపూర్, కిష్టాపూర్ పరిసర ప్రాంత గుట్టల్లో సంచారించిన పులి, ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ సమీపంలో పశువులపై దాడి చేసిన పులి ఒకటేనా? వేరు వేరా? అనే సందేహాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం గుంపన్‌పల్లి హట్టికి చెందిన ఆవు మేత కోసం అటవీ శివారులోకి వెళ్లగా పెద్దపులి దాడి చేసి చంపేసింది. ఘటనపై వివరాలు సేకరించామని సెక్షన్ అధికారి తెలిపారు.