calender_icon.png 19 February, 2026 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదక్ జిల్లాలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

18-02-2026 12:14:05 AM

మెదక్, ఫిబ్రవరి 17(విజయ క్రాంతి) :తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు మంగళవారం బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ డిప్యూటీ స్పీకర్, జిల్లా పార్టీ అధ్యక్షురాలు యం.పద్మా దేవేందర్ రెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలతో కలసి కేక్ కట్ చేసి కెసిఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం పార్టీ శ్రేణులు ఒకరికొకరు కేకు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ..తెలంగాణ రాష్ట్రం కోసం అనేక కష్టాలు నోచుకుని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజల కల నెరవేరించింది కెసిఆర్ అని అన్నారు. మెదక్ జిల్లా తరఫున బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు తరఫున కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించారు. 

ఈ కా ర్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్, కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, సెక్రటరీ కృష్ణ గౌ డ్, బిఆర్‌ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ లు లలి త, స్వరూప, గంగామణి, ఉదయ్ కుమార్, జుబేర్ అహ్మద్, దీపక్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కొట్టాల. విశ్వం, ఆర్కే శ్రీనివాస్, మాయ.మల్లేశం, చంద్రకళ, విజయలక్ష్మి, మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు యం. లావణ్య రెడ్డి ,

మెదక్ మండల పార్టీ అధ్యక్షు లు యం.అంజా గౌడ్, ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి నాయ కులు లింగ రెడ్డి, సురేందర్ గౌడ్, సంతోష్, మోచి కిషన్, సాదిక్, కిషన్, ఇస్మాయిల్, లక్ష్మీనారాయణ, ఇందాద్, సాయిలు, సాప సాయిలు, ఇలియాజ్ , నరేందర్ రెడ్డి, సంజీవరెడ్డి, ప్రభాకర్, ఎంబిపూర్ మహేష్, రవి, మాజీ సర్పంచ్ లతోపాటు, మెదక్ పట్టణ, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కొల్చారంలో... 

 కొల్చారం, ఫిబ్రవరి 17 :మండల కేంద్రమైన కొల్చారంలో బిఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి  కెసిఆర్ జన్మదినోత్సవ వేడుకలను మంగళవారం మండల పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీ శంకర్, యువజన విభాగం మండల శాఖ అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు ల ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో కొల్చారం మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు  యాబన్నగారి రవితేజ రెడ్డి, సర్పంచులు స్వామి, ఆంజనేయులు, మహేష్, విజయ్, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు కరంట్ రాజాగౌడ్, పూలెబోయిన మల్లేశం,

రమణ, గోదావరి,  ప్రవీణ్ కుమార్,సందీప్, బాగారెడ్డి, , ధనరాజ్, గౌరీ శంకర్, కాశీనాథ్, సిద్దు, సురేష్ గౌడ్, మురళి, శ్రీకాంత్, భాగయ్య,శంకర్, భాస్కర్, గ్యాస్ కృష్ణ, ఆర్కేలా నాగయ్య, ఆశన్నగారి కిష్టయ్య,కోరాంపల్లి గోపి, ఆశమ్మోళ్ల సత్తెనారి, దుర్గాప్రసాద్ గౌడ్, పాండ్ర వెంకటేశం, పంతులు శీను, షౌకత్ తదితరులు పాల్గొన్నారు.

 చేగుంట లో... 

చేగుంట ఫిబ్రవరి, 17,చేగుంట మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గాంధీ చౌరస్తా వద్ద మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు పంపిణి చేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎర్ర యాదగిరి, మంచిగట్ల శ్రీనివాస్, జిల్లా నాయకులు మొహమ్మద్ అలీ, రహీముద్దీన్, సోమా సత్యనారాయణ, కుర్ర లక్ష్మీనారాయణ. జనరల్ సింగ్. కోయల్కర్ రాజేష్. మండల యూత్ అధ్యక్షులు అన్నం రవి. వంశీ, సోమా వెంకటేష్,వివిధ గ్రామాల సర్పంచ్ లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రేగోడ్‌లో... 

రేగోడు, ఫిబ్రవరి 17:మండల కేంద్రమైన రేగోడు లో బిఆర్‌ఎస్ పార్టీ మండల నాయకులు కేకులు కట్ చేసి కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సుంకే రమేష్, రేగోడు బిఆర్‌ఎస్ పార్టీ రేగోడు గ్రామ అధ్యక్షులు రాచోటి సుభాష్ పటేల్,

మాజీ ఎంపిటిసి గొల్ల నరసింహులు, మాజీ సర్పంచులు రవీందర్, నర్సింలు మాజీ కోఆప్షన్ సభ్యులు మోయిజోద్దీన్, మాజీ పిఎ సిఎస్ చైర్మన్ రాజు యాదవ్, నాయకులు గురునాథ్ రెడ్డి, రాజు కమల్, గొల్ల శేఖర్, గొల్ల కృష్ణమూర్తి యాదవ్, గుండ్ల రమేష్, బాబా, పోచారం బాలయ్య, సల్మాన్, తదితరులు పాల్గొన్నారు. 

కేసీఆర్ మళ్ళీ రావాలి.. రాష్ట్రం సుభిక్షంగా ఉంచాలి..

సిద్దిపేట రూరల్, ఫిబ్రవరి 17: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మళ్ళీ సీఎం కావాలని రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పార్టీ పట్టణ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేటలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

పట్టణంలో సర్వ మత ప్రార్థనలో భాగంగా శ్రీ వెంకటేశ్వర దేవాలయం లో పూజలు నిర్వహించారు. చర్చి, మజీద్ లలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇతే హాత్ ఫౌండేషన్, రావిచెట్టు హనుమాన్ దేవాలయ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రక్త దాన శిభిరం నిర్వహించి, సిద్దిపేట క్రికెట్ స్టేడియంలో జర్నలిస్టులకు కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ పోటీలు నిర్వహించారు.

జర్నలిస్టుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు గెలుపొందిన టీం సభ్యులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ మచ్చ వేణు గోపాల్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు గుండు భూపేష్, మోహన్ లాల్, మేర సత్యనారాయణ, ఇర్షాద్ హుస్సేన్, రెడ్డి ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.