calender_icon.png 21 July, 2025 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఫారెస్ట్ ను రద్దు చేయాలి

21-07-2025 12:29:56 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై20 ( విజ యక్రాంతి):టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పాటుకు తీసుకువచ్చిన జీవో నెంబర్ 49 ను వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం దినకర్ ,కోట శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

ఆదివారంజిల్లా కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం సిగ్గుచేట ని, జిల్లాలో 339 గ్రామాలను ఖాళీ చేయిం చి కార్పొరేట్ కంపెనీలకు అప్పనంగా అప్పగించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిం చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కార్తీక్, దీపానంద్ పాల్గొన్నారు.