21-07-2025 04:25:29 PM
బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిల్ల శ్రీనివాస్ -
మందమర్రి (విజయక్రాంతి): ఆగస్ట్ 7న గోవా రాష్ట్రంలో జరిగే ఓబీసీ 10వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం(National BC Welfare Association) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిల్ల శ్రీనివాస్, పట్టణ యూత్ అధ్యక్షులు ముడారపు శేఖర్ లు కోరారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం చలో గోవా పోస్టర్లను ఆవిష్కరించి వారు మాట్లాడారు. మేమెంతో.. మాకంత.. అనే నినాదంతో హక్కుల కోసం పోరాడి విజయాలు సాధించుకుంటున్నామని ఆన్నారు. పాలితులుగా ఉన్నవాళ్ళం నేడు పాలకులం కావాలి అనే ఎజెండాతో పోరాడి అంతిమంగా రాజకీయ అధికారాన్ని సాధించి బీసీల ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ నాయకులు తడిగొప్పుల రవిరాజా, జాడ క్రాంతి కుమార్, చెప్పాల రమేష్, కలీం, యోగానంద రావు, సంపత్, కలీల్, ఎర్రన్న, యాదగిరి, చింతల రమేష్, యూత్ నాయకులు గరిగె సుమన్, ముష్కే అఖిల్, శ్రావణ్, అర్కటి రవీందర్, అనిల్, ఒమేశ్వర్ లు పాల్గొన్నారు.