calender_icon.png 21 July, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య

21-07-2025 12:27:59 AM

కుభీర్, జూలై ౨౦ (విజయక్రాంతి): నిర్మ ల్ జిల్లా కుభీరు మండలంలోని పార్డి (కె) గ్రామంలో మెట్పల్లి శ్రీనివాస్ (33) అనే యువకుడు మద్యానికి బానిసై శనివారం రాత్రి కుభీర్- పార్డి (కే) రహదారిలోని వ్యవసాయ క్షేత్రంలో గల రేకుల షెడ్డులో పురు గుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆదివారం ఉదయం వాకింగ్ చేస్తున్న పలువురు  షెడ్డులో పడి ఉన్న శ్రీనివాస్ పలకరిం చగా సమాధానం రాకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు కుభీర్ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న ఎస్సై ఏ కృష్ణారెడ్డి శవ పంచనామ నిర్వహించి మృతదేహాన్ని బైం సా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

మృతుడు శ్రీనివాస్ గత మూడు నాలు గు నెలల క్రితం అత్తగారింటి వద్ద భార్యతో గొడవపడి పని పాట లేకుండా తిరుగుతూ మద్యానికి బానిస అయ్యాడని, జీవితంపై విరక్తి చెంది మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ వివరించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.