29-12-2025 01:20:45 PM
ప్రజల్లో..భయం.. భయం..!
పరుగులు పెడుతున్న అధికారులు
బెల్లంపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని పెద్దపులి సంచారం బెంబేలెత్తిస్తుంది. పెద్ద బుగ్గ అటవీ ప్రాంతంలో ప్రవేశించిన పెద్దపులి రోజుకు ప్రాంతంలో సంచరించడం కలవరం రేపుతుంది. మండలంలోని చెర్లపల్లి, చంద్రవల్లి అటు ఈ ప్రాంతాల్లో పులి సంచారం సోమవారం వెలుగులోకి వచ్చింది. గత కొద్దిరోజులుగా పెద్దపులి బెల్లంపల్లి పరిసర అటవీ ప్రాంతాల్లో మకాం వేసి ఉండడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఈ మేరకు ఫారెస్ట్ అధికారులు పెద్దపులి కదలికలను గుర్తించారు. చంద్రవెల్లి, చర్లపల్లి శివారు ప్రాంతాల్లో పెద్దపులి పాదముద్రలను గుర్తించారు. పులి సంచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు.
బుగ్గ అటవీ ప్రాంతం నుంచి పెద్దపులి మండలం పరిసర అటవీ ప్రాంతం చుట్టూ సంచరిస్తుo డటంతో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ బెల్లంపల్లి ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. పులి సంచారం దృష్టిలో పెట్టుకొని బుగ్గ అటవీ ప్రాంత సమీప గ్రామాలు కన్నాల, లక్ష్మీపురం, చంద్రవల్లి, చర్లపల్లి శివారు ప్రాంతాల గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఇప్పటికే డబ్బు చాటింపు చేశారు. పంట పొలాలకు రైతులు వెళ్లే అప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. అవసరమైతే కానీ రైతులు పంట పొలాలకు గుంపులుగా మాత్రమే వెళ్లారన్నారు. బెల్లంపల్లి మండల పరిధిలో పెద్దపులి సంచారం ఫారెస్ట్ అధికారులను పరుగులు పెట్టిస్తుంది. ఎప్పటికప్పుడూ పెద్దపులి కదలికలను గమనిస్తూ.. ఫారెస్ట్ అధికారులు ప్రజలను మరింత అప్రమత్తం చేస్తున్నారు. ఏదేమైనా మునుపెన్నడూ లేని విధంగా పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. బెల్లంపల్లి శివారు అటవీ ప్రాంతశివారులలో పెద్దపులి కదలికలు కలకలం రేపుతుంది.