calender_icon.png 29 December, 2025 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీశ్ రావు అంత అహంకారం ఎందుకు?

29-12-2025 02:17:34 PM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly sessions) ప్రారంభమయ్యాయి. దీంతో నేతలు మధ్య మాటల యుద్ధం మొదలైంది. హరీశ్ రావు(Harish Rao) దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. ఇరిగేషన్ లో తానే మాస్టర్ అని హరీశ్ రావు అనుకుంటున్నారని ఉత్తమ్ చురకలంటించారు. హరీశ్ రావుకు అంత అహంకారం ఎందుకు? అని ప్రశ్నించారు. ఎవరి హయాంలో ఏం జరిగిందో అన్ని పత్రాలు బయటపెడతామని హెచ్చరించారు. పాత జీవో కాపీలను మంత్రి ఉత్తమ్ కుమార్ మీడియాకు చూపించారు.

కృష్ణా జలాల్లో(Krishna waters) తాము 90 టీఎంసీలు డిమాండ్ చేస్తే.. 45 టీఎంసీలు అడిగామని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. అబద్ధాల పునాదుల మీదే బీఆర్ఎస్ బతుకుతోందని ఆరోపించారు. తెలంగాణకు అన్యాయం జరిగేలా తాను ఎందుకు లేఖ రాస్తానని వివరించారు. సీడబ్ల్యూసీకి రాసిన లేఖలో ఒక భాగాన్నే చూపిస్తున్నారని తెలిపారు. కృష్ణా బేసిన్ పై అసెంబ్లీలో ప్రజెంటేషన్ కు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. మేడిగడ్డ మరమత్తులపై ఎల్అండ్ టీకి నోటీసులిచ్చామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. మేడిగడ్డలో పలు పరీక్షలు, ఇతర తనిఖీలకు ఎల్అండ్ టీ ఒప్పుకుందని తెలిపారు. త్వరలోనే మేడిగడ్డ పనులు మొదలవుతాయని మంత్రి వివరించారు.