calender_icon.png 29 December, 2025 | 3:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత వైద్య శిబిరం

29-12-2025 01:16:57 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణం లోని సన్ షైన్ హాస్పిటల్ మరియు ఆదరణ సేవా సమితి  వారి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని జ్యోతి నగర్ లోని ఎస్సార్ ప్రైమ్ స్కూల్ ఆవరణలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలకు అవసరమైన బిఎంఐ/హెబి/బీపీ/జి ఆర్ బి ఎస్/ఈసీజీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా సన్ షైన్ హాస్పిటల్ సీఈవో డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ కార్యక్రమాన్ని ఆదరణ సేవా సమితి వారు గత కొన్ని సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ జ్యోతి నగర్ ప్రాంతంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని మమ్మల్ని కోరడంతో ఆదివారం రోజున మేము మా హాస్పిటల్ పక్షాన ఈ వైద్య శిబిరాన్ని ఎర్పాటు చేయడం జరిగింది. చలి ఎక్కువగా ఉన్న కారణంగా ఈసీజీ ని ఉచితంగా అందిస్తూ ఉచితంగా మందులను అందించినాము ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదరణ సేవా సమితి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు  అభినందనియమని అన్నారు.

తదుపరి సంస్థ అధ్యక్షురాలు కర్రె పావని-రవి మాట్లాడుతూ ఆదరణ సేవా సమితి ద్వారా జ్యోతి నగర్ వాసులకు వైద్య శిబిరం  నిర్వహించాలి అని కోరగానే సన్ షైన్ యాజమాన్యం అంగీకరించి ఉచిత పరీక్షలు, మందులు పంపిణీ చేయడం చాలా సంతోషం అని వారు మా సంస్థ ద్వారా గతంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాము భవిష్యత్తులో కుడ మేము ప్రజల‌ మద్దతుతో మరిన్ని సేవలు అలాగే డివిజన్ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో కూడ మా సంస్థ ముందు ఉంటుందని తెలిపారు.ఈ వైద్య శిబిరంలో సన్ షైన్ హాస్పిటల్ డాక్టర్ దివ్య రెడ్డి, డాక్టర్ నిఖిల రెడ్డి, డాక్టర్ సాయి కృష్ణ, డాక్టర్ అంజుమ్ లు, అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఎడ్ల సంపత్ కుమార్, ఎస్సార్ ప్రైమ్ స్కూల్ జోనల్ ఇంచార్జి శశిధర్, ప్రధానోపాధ్యాయురాలు కొండ  నాగప్రణవి ఆదరణ సేవా సమితి సభ్యులు మరియు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.