calender_icon.png 29 December, 2025 | 3:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోగికి మెడికవర్ హాస్పిటల్ లో విజయవంతమైన చికిత్స

29-12-2025 01:23:05 PM

హనుమకొండ, (విజయక్రాంతి): మెడికవర్ హాస్పిటల్ వరంగల్‌లోని వైద్యులు తీవ్రమైన గుండె సమస్యతో ఆసుపత్రికి వచ్చిన 47 ఏళ్ల రోగికి విజయవంతంగా చికిత్స అందించారు. ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో ఆసుపత్రికి వచ్చిన ఈ రోగికి గతంలో ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్  మధుమేహం, అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ రోగి కొన్ని రోజుల క్రితమే అదే ఆసుపత్రిలో కొరోనరీ యాంజియోగ్రఫీ చేయించుకున్నారు. అయితే, లక్షణాలు మరింత తీవ్రంగా మారడంతో తిరిగి ఆసుపత్రికి వచ్చారు. తదుపరి పరీక్షల్లో అతనికి డబుల్ వెసెల్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉండటంతో పాటు, ఎడమ ప్రధాన ధమనిగా పరిగణించబడే ఎల్‌ఏడీ ఆర్టరీలో 100 శాతం బ్లాకేజ్ ఉన్నట్లు గుర్తించారు. అదనంగా స్టెంట్ థ్రాంబోసిస్ కూడా ఉండటం వల్ల ఈ కేసు అత్యంత సంక్లిష్టంగా మరియు ప్రమాదకరంగా మారింది.

ఈ అత్యవసర పరిస్థితిలో డాక్టర్ శ్రవణ్ కుమార్ ఆర్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ నాయకత్వంలో రోగికి తక్షణమే ఆధునిక గుండె చికిత్స చేపట్టినట్లు తెలిపారు. తీవ్రమైన ప్రమాదం ఉన్నప్పటికీ, వైద్య బృందం విజయవంతంగా ప్రైమరీ యాంజియోప్లాస్టీ నిర్వహించి, ఎల్‌ఏడీ ఆర్టరీలో డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ ను అమర్చడం ద్వారా గుండెకు రక్తప్రసరణను పునరుద్ధరించామని, చికిత్సకు రోగి మంచి స్పందన చూపించి, ఆరోగ్య పరిస్థితిలో స్పష్టమైన మెరుగుదల కనబరిచాడు. అతనికి యాంటీప్లేట్‌లెట్ థెరపీ, రక్తపోటు నియంత్రణ మందులు, స్టాటిన్లు, డయూరెటిక్స్ మరియు ఇతర సహాయక చికిత్సలు అందించినట్లు తెలిపారు.

ఈ సంఘటన అత్యంత సంక్లిష్టమైన, ప్రాణాపాయ గుండె అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందనీ, ఆధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన నిపుణులు మరియు సమయోచిత నిర్ణయాల వల్ల రోగి ప్రాణాలు కాపాడబడినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హరినాథ్, నవీన్,హాస్పిటల్  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.