29-12-2025 01:18:17 PM
బెల్లంపల్లి,(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2026-27 విద్య సంవత్సరానికి 5, 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు ప్రవేశాలకు తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి ప్రవేశ పరీక్ష ( టిజిసెట్ ) దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ వూటూరి సంతోష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 11వ తేదీ నుండి జనవరి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఫీజు రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 22న జరుగుతుందనీ తెలిపారు.
21వ శతాబ్దం గురుకులాల్లో నాణ్యమైన విద్యతోపాటు ఉచిత దుస్తులు, పుస్తకాలు, సన్న బియ్యంతో కూడిన పోషకమైన ,రుచికరమైన సమతుల్య ఆహారం , హాస్టల్ సౌకర్యం, నెలవారి కాస్మెటిక్ చార్జీలు బ్యాంకుల ద్వారా చెల్లించబడుతున్నవని తెలిపారు. విద్య విషయక అంశాలతో పాటు సమానంగా సహాపాఠ్య కార్యకలాపాలు ఆటలు ,క్రీడలు, కోడింగ్ ,లలిత కళలు, గ్రంధాలయ సౌకర్యం మొదలైన వాటిపై ప్రత్యేక దృష్టి ఉంటుందన్నారు. క్రీడల్లో విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించి శిక్షణ ఇస్తామనీ పేర్కొన్నారు. గురుకులాల్లో సమర్థవంతమైన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన, నిరంతర పర్యవేక్షణ, ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ అన్ని ప్రభుత్వ పరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధిస్తున్నాని వెల్లడించారు.