calender_icon.png 29 December, 2025 | 4:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధం

29-12-2025 02:01:58 PM

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు(Telangana Legislative Assembly sessions) సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా సాగునీటి సమస్యలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకంపై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశం అయ్యారు. కాసేపటి క్రితమే మంత్రులతో సీఎం సమావేశం ముగిసింది. నీటివాటాల విషయంలో మంత్రులు అందరూ అలర్ట్ గా ఉండాలని సీఎం ఆదేశించారు. బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకునే పనిలో ఉందని ఆయన సూచించారు. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు సిద్ధంగా కావాలని తెలిపారు. జిల్లాల వారీగా మంత్రులు ఎదురుదాడికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ముఖ్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతిపక్షం అడిగే ప్రతి అంశానికి సమాధానం ఇవ్వాలన్నారు. జనవరి 4 వరకు సభ జరిగే అవకాశముందని తెలిపారు.