13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట భద్రత

19-01-2026 09:35 PM

గద్వాల: ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత పటిష్టంగా  ఉండాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గల గోదాములో ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం) లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను జిల్లా కలెక్టర్ బి. ఎం.సంతోష్ సోమవారం సంబంధిత అధికారులు,వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనఖిలో భాగంగా కలెక్టర్ ఈ తనిఖీ నిర్వహించారు. గద్వాల జిల్లాకు సంబంధించిన ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తో పాటు భద్రత నిర్వహణను పరిశీలించారు.ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ నిర్వహణకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు.స్ట్రాంగ్ రూమ్ భద్రతలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ కరుణాకర్, సురేష్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.