ఈవీఎం గోదాం వద్ద పటిష్ట భద్రత చర్యలు
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 8 (విజయ క్రాంతి): ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాం వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఈవీఎంలు భద్రపరిచిన గోదామును జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎం గోదాం వద్ద 24 గంటల పాటు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు. గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు జమీల్, నాయబ్ తహసీల్దార్ శ్యామ్లాల్, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






