17 March, 2026 | 1:03 PM

Breaking News

బడ్జెట్ అంచనాలు బోల్తా కొట్టాయి.. రివైజ్డ్ అంచనాలు రీచ్ కావట్లేదు   •   ఈ నెల 22 నుంచి రైతు భరోసా పంపిణీ.. అసెంబ్లీ సాక్షిగా ఆది శ్రీనివాస్ ప్రకటన   •   మియాపూర్‌లో రోడ్డుకు అడ్డంగా పడిన బస్సు.. 10 మందికి గాయాలు   •   8 నెలల క్రితం లవ్ మ్యారేజ్.. 4 నెలల గర్భిణి భార్యను చంపిన భర్త   •   కేసీఆర్ సంచలన నిర్ణయం.. పైలెట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు!   •   కూకట్‌పల్లిలో భారీ దారి దోపిడీ.. కళ్లలో కారం కొట్టి..   •   పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి   •   గవర్నర్ ప్రసంగం డొల్ల   •   ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి   •   రాష్ట్ర అభివృద్ధిలో.. ప్రతి పౌరుడు భాగస్వామి   •  

జీపీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు

09-12-2025 12:00 AM

శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు 1384 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు 

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి 

నిజామాబాద్, డిసెంబర్ 8 (విజయ క్రాంతి): నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. శాంతియుత వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు అన్ని రకాల పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. మొదటి విడత బోధన్ డివిజన్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా.

ఈ సబ్ డివిజన్ పరిధిలో 11 మండలాలలో 1084 గ్రామ పంచాయతీలు 1642 వార్డులలో 268 పోలింగ్ కేంద్రాలలో 2,61,210 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ శాఖ పరంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఇందుకుగాను సబ్ డివిజన్ పరిధిలోని ఎన్నికలు నిర్వహించే ప్రాంతాలలో మూడు చెక్ పోస్ట్ లను ( సాలూర , కండ్ గావ్, పోతంగల్ ) ఏర్పాటు చేసి నిర్విరామముగా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి 24/7 వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

లిక్కర్ మొత్తం 361.46 లీటర్లు సీజ్ చేయడం జరిగిందని, వాటి విలువ దాదాపు 2,56,985/- గలవని తెలిపారు.బోధన్ డివిజన్ పరిధిలో బైండోవర్ లు మొత్తము 183 మందిని సంబంధిత తహసీల్దా రుల ముందు హాజరు పరిచి బైండోవర్ చేయడం జరిగిందన్నారు. బోధన్ డివిజన్ పరిధిలో ఈ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమా నియమావళిని ఉల్లంఘించి నటువంటి వారిపై మూడు కేసుల నమోదు చేయడం జరిగిందని,  ఎడపల్లి , బోధన్ రూరల్ , కోటగిరి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.

ఈ నేపథ్యంలో సబ్ డివిజన్ పరిధిలోని మొత్తం 10 గన్ లైసెన్లు కలిగినటువంటి వారిని డిపాజిట్ చేయమని కోర గా ఆరుగురు డిపాజిట్ చేయడం జరిగిందన్నారు.  మిగతా నాలుగు గన్ లైసెన్సులు బ్యాంకులకు సంబంధించినవి ఉన్నాయన్నారు. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు ఎక్కడ ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తగా పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 1384 మంది సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింద ని సిపి సాయి చైతన్య తెలిపారు.