09-12-2025 12:00:00 AM
రెండేళ్లు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై ఘాటుగా విమర్శించిన అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్, డిసెంబర్ 8(విజయ క్రాంతి): దేవుళ్ళపై ఒట్టే సి మాటతప్పిన అప ఖ్యాతి రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ఆరోపించారు. ఎమ్మెల్యేగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సోమవారం బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీ అమలు చేయలేని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలేల పరిస్థితి ఘోరంగా తయారైందని, కనీసం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి నెలకొందని అన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ సోమవారం బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి కోసం 130 కోట్ల నిధులు బీజేపీ ఎమ్మెల్యేగా తాను రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి తీసుకోవచ్చానని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరిస్తుందని మండిపడ్డారు. నగర మౌలిక వసతులు అభివృద్ధి నిధులకోసం ఇప్పటివరకు 650 లేఖలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందని అన్నారు. అయినా ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడం హేయమైన చర్య అన్నారు. 10 ఏళ్ల బి ఆర్ ఎస్ పాలనలో నగరంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వలేక పోయారని విమర్శించారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ పార్టీ ఇచ్చిన హామీ ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పటివరకు ఇవ్వలేకపోయారన్నారు. ఈ సమావేశంలో బిజెపి మాజీ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.