24 August, 2026 | 2:42 AM

అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ సీజ్

24-08-2026 01:51 AM

ఇద్దరిపై కేసు నమోదు: ఎస్సై గంగరాజు

తూప్రాన్, ఆగస్ట్ 23: గడిచిన రాత్రి వెంకటాపూర్ శివారు ప్రాంతం నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్నారనే సమాచారం మేరకు తూప్రాన్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక టిప్పర్ను తనిఖీ చేయగా, అందులో మట్టి ఉన్నట్లు గుర్తించారు.

మట్టి తరలింపుకు సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు, రవాణా పత్రాలు లేక పోవడంతో టిప్పర్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి టిప్పర్ డ్రైవర్ అనిల్, యజమాని శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమంగా మట్టి, ఇసుక తదితర మైనర్ మినరల్స్ను తరలించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తూప్రాన్ పోలీసులు తెలిపారు.