calender_icon.png 12 September, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈనెల 16న తిరుపతి అరుణాచలం బస్సు..

12-09-2025 06:27:51 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఆర్టీసీ నిర్మల్ డిపో నుండి ఈ నెల 16 తేదీ మంగళవారం మధ్యాహ్నo నిర్మల్ డిపోకు చెందిన బస్సు సర్వీసు, తిరుపతి అరుణాచలం ఏర్పాటు చేసినట్లు నిర్మల్ డిఎం పండరీ తెలిపారు నిర్మల్ నుండి ఒంటి గంటకు బయలు దేరి 17వ తేదీ ఉ.6 గం.లకు చేరుకుంటుందన్నారు దిగువ తిరుపతి లో శ్రీనివాస కాంప్లెక్స్ లో సర్వ దర్శనం టికెట్లు తీసుకొని వారు ఇచ్చిన టైమ్ లో శ్రీవారి దర్శనం చేసుకోవచ్చన్నారు టికెట్లో ఉన్న టైమ్ లోపల దిగువ తిరుపతి లో గోవింద రాజుల దర్శనం, పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకొని

తిరుమల చేరుకొని స్వామి వారిని దర్శించుకొని తెల్లవారి 18 వ తేదీ రోజు ఉ.6 గం.లకు తిరుపతి నుండి బయలు దేరి కానిపాకం వరాహ సిద్ది వినాయక టెంపుల్ దర్శించుకొని తమిళనాడులోని తిరువన్న మలై అరుణాచలేశ్వరుని దర్శనం గిరి ప్రదక్షిణ చేసుకొని తిరిగి నిర్మల్ చేరుకొనును. 5 రోజుల యాత్ర ఉంటుందని, ఒకరికి రూ.6300/-లు  పోను, రాను ఉంటుందని ఈ అవకాశం సద్వినియోగ పరచుకోవాలని డిపోమేనేజర్ కే పండరి తెలిపారు.మరిన్ని వివరాలకు 9959226003, 83280 21517, 7382842582 లో సంప్రదించా లని ఆయన కోరారు.