calender_icon.png 12 September, 2025 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏచూరి స్ఫూర్తితో ప్రజాతంత్ర లౌకిక శక్తులను ఏకం చేయాలి

12-09-2025 06:31:58 PM

సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి 

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): సిపిఎం అఖిల భారత మాజీ కార్యదర్శి సీతారాం ఏచూరి స్ఫూర్తితో వామపక్ష ప్రజాతంత్ర, లౌకిక శక్తులను ఏకం చేయాలని, కేంద్ర ప్రభుత్వ స్వతంత్ర సంస్థలను కాపాడుటకు ప్రజలను సమీకరించి ఉద్యమాలు చేయాలని పార్టీ శ్రేణులకు సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం  నల్లగొండ సిపిఎం జిల్లా కార్యాలయంలో సీతారాం ఏచూరీ ప్రథమ వర్ధంతి సభకు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ... విద్యార్థి ఉద్యమం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి వరకు అంచలంచెలుగా ఎదిగిన సీతారాం ఏచూరీ పోరాట జీవితాన్ని గుర్తుచేశారు.  ప్రధాని ఇందిరా ఆహ్వానించినా ఆమె కార్యాలయంకు వెళ్లకుండా ప్రధానినే విద్యార్థుల నడుమకు తీసుకవచ్చిన నాటి నుంచి ప్రతి పోరాటంలోనూ ఏచూరీ క్రీయాశీలకంగా వ్యవహరించారని తెలిపారు. తన పోరాట పటిమ, వివిద అంశాలలో అపరిమిత అవగాహనతో, వాగ్దాటితో భారత జాతీయ రాజకీయాల్లో ఓ కీలక నేతగా ఎదగడమే కాక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడు ఏచూరీ అన్నారు. ఆయన  మరణం కార్మికవర్గానికి, లౌకికవాదులకు, ప్రజాస్వామ్యవాదులకు, ప్రజాఉద్యమానికి తీవ్ర లోటని విచారం వ్యక్తంచేశారు.