calender_icon.png 12 September, 2025 | 8:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌తో చంద్రవెల్లిలో విషాదం

12-09-2025 06:21:20 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో గురువారం పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎన్కౌంటర్ లో పదిమంది మావోయిస్టులు మృతి చెందగా వీరిలో ఒకరు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామానికి చెందిన జాడి వెంకటి గా భావిస్తున్నారు. విషయం చత్తీస్ ఘడ్ పోలీసులు స్థానికంగా ధ్రువీకరించడంతో చంద్రవెల్లి గ్రామంలో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక పోలీసులను ఫోన్ లో సంప్రదించగా తమకు సమాచారం లేదని తెలపడంతో అయోమయానికి గురవుతున్నారు. గ్రామంలో విషాదం నెలకొంది.దీనిపై స్పష్టత రావాల్సి ఉంది