calender_icon.png 2 October, 2025 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిరుదు రాజమల్లు సేవలు మరువలేనివి

02-10-2025 12:00:00 AM

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు

సుల్తానాబాద్, అక్టోబర్ 1 (విజయ కాంతి): పేద ప్రజల బాగోగుల కోసం.వారి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు అందించిన సేవలు మరువలేనివని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. బిరుదు రాజమల్లు 75వ జయంతి సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలోని మునిసిపల్ కార్యాలయం ఎదుట ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ 45 సంవత్సరంలుగా రాజకీయంగా ఉన్న గొప్ప నాయకులు రాజమల్లు అని, మాస్ లీడర్ గా ఆయన అందించిన సేవలు మరువలేనివి అన్నారు... అన్న అడుగుజాడల్లో అం దరం నడుస్తామని విజయ రమణారావు అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ ప్రకాష్ రావు , సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి డాక్టర్ అయిల రమేష్ , సాయిరి మహేందర్, అల్లంకి సత్యనారాయణ, అల్లంకి నందన్న , కొమురవెల్లి భాస్కర్ , సత్యం , గాజుల రాజమల్లు, బిరుదు కృష్ణ సమత, ముత్యాల రవీందర్, దనాయక్ దామోదర్ రావు, కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న), పన్నాల రాములు, పారుపల్లి గుణపతి , అమిరీశెట్టి రాజలింగం, తిరుపతి , కుమార్ కిషోర్, అబ్బయ్య గౌడ్ , ఏకశిలా శ్రీనివాస్, రఫిక్ , శ్రీవాణి కళాశాల కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక్ , దుడెం అంజయ్య , నన్ను ,జూపాక కుమారస్వామి , వడ్లూరి శ్రీనివాస్, రాజమల్లు కుటుంబ సభ్యులు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సాయిబాబా , కృష్ణ సమత, శ్రీనివాస్, అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..