02-10-2025 12:00:00 AM
చిగురుమామిడి, అక్టోబర్ 1(విజయక్రాంతి): మండల కేంద్రం లోని జడ్పీ ఉన్నత పాఠశాల 2000-2001 పదో తరగతి విద్యార్థులు బుధవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. చిన్న ముల్కనూర్ లోని ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమం లో దాదాపు 50 మంది పూర్వ విద్యార్థులు పాల్గొని తమ చిన్న నాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. తమకు విద్య నేర్పిన గురువులను సన్మానించి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు గంగు సూర్యనారాయణ మూర్తి, పన్యాల భూపతి రెడ్డి, అంజయ్య, భూపతి నర్సింహారెడ్డి, విద్యార్థులు దాసరి శ్రీనివాస్, సీ హెచ్. వెంకటేష్, ఎం. రాజు, బ్రహ్మచారి, శ్రీకాంత్, మహేష్, నరేందర్, భాషవేణి రమేష్, బొల్లి రమేష్, వంగ శ్రీనివాస్, పొన్నం శ్రీనివాస్, శ్రీకాంత్, సదాచారి, బుచ్చన్న తదితరులుపాల్గొన్నారు.