calender_icon.png 17 November, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన టీఎన్జీవో నాయకులు

17-11-2025 12:22:34 AM

కరీంనగర్, నవంబరు 16 (విజయ క్రాంతి): హుస్నాబాద్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన సత్య నారాయణ స్వామి వ్రతం కార్యక్రమం ఎం తో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఆహ్వానం మేరకు టీఎన్జీవోల సం ఘం ప్రతినిధుల బృందం హాజరై, మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందజేశారు. మంత్రిపై సత్యనారాయణ స్వామి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

అలాగే ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినందుకు మంత్రికి టీఎన్జీవోల సంఘం అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సంగేం లక్షణ్ రావు, కేంద్ర సంఘం నా యకులు నాగుల నరసింహ స్వామి, కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మారుపాక రాజేష్ భరద్వాజ్, నాయకులు భగవాన్ రెడ్డి, పవన్, వేణు, తదితరులుపాల్గొన్నారు.