17-11-2025 12:23:54 AM
జగిత్యాల అర్బన్, నవంబర్ 16 (విజయ క్రాంతి): జగిత్యాల సర్కిల్ టౌన్ - 1 సెక్షన్ కార్యాలయం స్టాఫ్ రూమ్ లో శనివారం రాత్రి మద్యం సేవించిన ముగ్గురు విద్యుత్ ఉద్యోగులను సస్పెన్షన్ చేసినట్టు జగిత్యాల డి ఈ గంగారాం తెలిపారు.
కార్యాలయం స్టాఫ్ రూమ్ లో మద్యం సేవించిన అసిస్టెంట్ లైన్ మెన్లు ఏ. ప్రభాకర్, జి.బాలకృష్ణ,వి. రాజశేఖర్ లు కార్యాలయంలో మందు పార్టీ చేసుకున్నట్లు ప్రాధమిక విచారణలో నిర్ధారణ కావడంతో వెంటనే ముగ్గురు అసిస్టెంట్ లైన్ మెన్లను సస్పెండ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
ఈ విషయంపై సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తీవ్రంగా స్పందించారనిఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 సర్కిళ్లలోని అన్ని సబ్ స్టేషన్లు, విద్యుత్ సంస్థ కార్యాలయాలు, సంస్థ ప్రాంగణంలో విధులు నిర్వహించే ప్రదేశలలో అనైతిక కార్యకలాపాలు, క్రమశిక్షణా విరుద్ధ చర్యలకు పాల్పడితే ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, వారిని వెంటనే విధుల నుండి తొలగిస్తామని హెచ్చరించినట్లు తెలిపారు.దీనికి సంబంధించి హెచ్‌ఆర్డి విభాగం నుండి అడ్వైజరీ మెమోను జారీచేసినట్లు తెలిపారు.